ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోనే ఉన్నా.. సర్వోత్తమ్ రెడ్డి క్లారిటీ

కలం, సూర్యాపేట: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి (Ramreddy Sarvotham Reddy) స్పష్టం చేశారు. నామినేషన్ ఉపసంహరణ, పోటీ నుంచి తప్పుకోవడం వంటి ప్రచారాలన్నీ కావాలని కొందరు చేస్తున్న అవాస్తవాలని ఆయన ఖండించారు.

తన అభ్యర్థిత్వంపై వస్తున్న పుకార్లపై సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. “టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు, చేతులెత్తేశారు, యూ టర్న్ తీసుకున్నారు” అంటూ సాగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీ నిర్ణయాన్ని గౌరవించి పూర్తి నిబద్ధతతో పోటీలో ఉంటున్నానని తెలిపారు.

గతంలో తన రాజకీయ లక్ష్యాల గురించి చెప్పిన మాటలను, ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలతో ముడిపెట్టి వక్రీకరించడం సరికాదని సర్వోత్తమ్ రెడ్డి (Sarvotham Reddy) హితవు పలికారు. అంతేకాకుండా, సామాజిక వర్గాల పేరుతో బీసీల్లో ఆగ్రహం ఉందంటూ కాంగ్రెస్ అభ్యర్థిని మారుస్తుందనే ఊహాగానాలకు ఎలాంటి ఆధారం లేదని, ఇటువంటి వ్యాఖ్యలు ప్రజల మధ్య విభేదాలు సృష్టించే బాధ్యతారాహిత్య చర్య అని మండిపడ్డారు.

పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి అసెంబ్లీ వేదికగా బలమైన ప్రాతినిధ్యం వహించడమే తన ప్రధాన ధ్యేయమని సర్వోత్తమ్ రెడ్డి ఉద్ఘాటించారు. పట్టభద్రుల ఆశీస్సులతో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి, వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతానని అన్నారు.

Also Read : విద్యుత్ వెలుగుల్లో సరికొత్త విప్లవం.. తెలంగాణలో బీఈఎస్ఎస్ అభివృద్ధి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>