నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యం: చైర్మన్

కలం, మునుగోడు: నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో “నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ” కార్యక్రమం నిర్వహించారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్ధానిక గాంధీజీ విద్యాసంస్థల యందు 33వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ (Gandhiji Foundation) చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, అరుణ దంపతులు మాట్లాడుతూ.. తమ జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తామని తెలిపారు. దీనితో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ, సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని అన్నారు.  ఏ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాక వారి ముఖంలో చిరునవ్వు చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు.

గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని వారు స్పష్టం చేశారు. పేదలకు సేవ చేయడంలో ఉన్న ఆనందం మరెక్కడా లభించదని అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మా వెంకన్న, కటకం రమేష్ లు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మీ దంపతులను ఆదర్శంగా తీసుకొని చండూరులో డాక్టర్ కోడి శ్రీనివాసులు-అరుణ దంపతులు  33 నెలలుగా సుమారు రూ.15 లక్షలు  విలువచేసే నిత్యావసర సరుకులు నిరుపేదలకు అందించారని తెలిపారు. .

ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఖలీల్, కల్లెట్ల చంద్రకళ మారయ్య, షరీఫ్, పురోహితులు ప్రవీణ్ శర్మ, గాంధీజీ విద్యాసంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, బోడ విజయ్, బోడ యాదయ్య, బుషిపాక యాదగిరి, గోపి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>