మిషన్ భగీరథ నీటినే తాగాలి

కలం, సోన్ : మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సోన్ మండలం కడ్తాల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గుర్రం రాము అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మిషన్ భగీరథ అధికారులు గ్రామస్తులకు తాగునీటి వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ మిషన్ భగీరథ (Mission Bhagiratha) ద్వారా సరఫరా అవుతున్న నీటినే తాగాలని సూచించారు.

మినరల్ వాటర్‌ను తరచుగా వినియోగించడం వల్ల కలిగే ఇబ్బందులను వివరించారు. మినరల్ వాటర్‌లో సహజంగా ఉండే కొన్ని లవణాలు తక్కువగా ఉండే అవకాశం ఉందని, ప్రజలు ప్రభుత్వ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ నీటిని వినియోగించాలని సూచించారు. అంతకుముందు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సుమయ తస్కిన్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>