మెట్రో-ఆర్టీసీ కామ‌న్ పాస్ వ‌చ్చేసింది!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్‌లో మెట్రో, ఆర్టీసీ కామ‌న్ పాస్‌ను (Metro – RTC Common Pass) నేడు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) ఆవిష్క‌రించారు. తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్ఆర్టీసీ, హైద‌రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పాస్‌ను తీసుకొచ్చాయి. ఈ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, అజారుద్దీన్‌, వివేక్ వెంక‌ట‌స్వామి, త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇక పాస్ ధ‌ర‌ల వివ‌రాలు ప‌రిశీలిస్తే,.. నెలవారీ పాస్ ఛార్జీలను రూ.8,500గా నిర్ణ‌యించారు. రోజువారీ పాస్ ఛార్జీలను రూ.400గా నిర్ణయించారు. నెలవారీ పాస్‌లో మెట్రో వాటా రూ.7,000, ఆర్టీసీ వాటా రూ.1,500గా ఉంది. మ‌రోవైపు రోజువారీ పాస్‌లో మెట్రో రూ.300, ఆర్టీసీ రూ.100గా లెక్కిస్తారు. కార్డు కొనుగోలు చేసే సమయంలో రూ.100ను డిపాజిట్ తీసుకోనున్నారు. మ‌ళ్లీ కార్డు వాపసు చేసినప్పుడు ఈ డ‌బ్బును తిరిగి ఇస్తారు.

పాస్‌లు కొనుగోలు చేసిన భ‌ట్టి

ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 15 మంది మంత్రుల కోసం డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka) స్వ‌యంగా డ‌బ్బులు చెల్లించి రోజువారీ ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ కొనుగోలు చేశారు. శ‌నివారం ఉదయం 10 గంటలకు భ‌ట్టి స‌హా మంత్రులంతా బేగంపేట నుండి ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ ద్వారా మెట్రోలో ప్రయాణం చేయనున్నారు.

Also Read : దిల్‌సుఖ్‌నగర్ ఆలయంలో పూజారిపై దాడి!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>