కలం, యాదాద్రి భువనగిరి : మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anuraag Jayanti) అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ (Yadadri Collectorate) సమావేశ మందిరంలో గాంధీజీ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సత్యాగ్రహ మార్గాలు నేటి సమాజానికి కూడా ఆదర్శప్రాయమని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగాలు, అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి అంజిరెడ్డి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

