గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: మహేష్ కుమార్ గౌడ్

కలం, నిజామాబాద్ బ్యూరో : అహింసను ఆయుధంగా, సత్యాన్ని మార్గంగా చేసుకుని కోట్లాది భారతీయుల్లో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్  ఆమహనీయునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి అందించిన సేవలను, ఆయన అనుసరించిన సిద్ధాంతాలను స్మరించుకున్నారు.

సత్యం, అహింస, సహనం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి మహోన్నత విలువలను తన జీవితంలో ఆచరించి, వాటి శక్తిని ప్రపంచానికి చాటిన మహాత్మా గాంధీ జీవితం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిందని అన్నారు. గాంధీజీ కలలు కన్న సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, శాంతి, సౌభ్రాతృత్వం వంటి విలువలకు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఆయన ఆశయాలను నేటి తరానికి అందించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>