బాన్సువాడలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

కలం, నిజామాబాద్ బ్యూరో : మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జయంతి సందర్భంగా బాన్సువాడలోని (Banswada) గాంధీ చౌక్‌లో మహాత్మ గాంధీ విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సత్యం, అహింస, శాంతి, సహనం వంటి విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మ గాంధీ మహనీయుడని అన్నారు. స్వాతంత్ర సమరంలో గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం, ప్రజలను ఏకం చేసిన ఆయన నాయకత్వం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు.

గాంధీజీ కలలు కన్న స్వచ్ఛమైన, సమానత్వం, సామాజిక న్యాయం కలిగిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ ఆలోచనలు, ఆదర్శాలు నేటి సమాజానికే కాకుండా భావితరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ, పట్టణ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొని మహాత్మ గాంధీకి నివాళులర్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>