ఎస్‌ఐఆర్‌పై సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక ఆదేశాలు

కలం, నిర్మల్ : ఎస్‌ఐఆర్‌-2026(SIR 2026) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి (Sudharsan Reddy) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఎస్‌ఐఆర్‌-2026, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాలని సీఈఓ సూచించారు.

ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు చేస్తూ, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి దశను పారదర్శకంగా పూర్తి చేయాలని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Bhavesh Mishra) మాట్లాడుతూ.. జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఎన్నికల ఉన్నతాధికారులకు వివరించారు. మొత్తం ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>