కలం, వెబ్ డెస్క్ : నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రూపొందించిన ది ప్యారడైజ్ చిత్రంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరహా మేనరిజమ్స్ ఉన్న ఎమ్మెల్యే శంకరన్న పాత్రలో జీవించిన నటుడు ప్రియదర్శి (Priyadarshi) ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు.
సినిమాలో తెలంగాణ యాస, నడక, మాట్లాడే తీరుతో కేసీఆర్ జ్ఞాపకాలను ప్రియదర్శి అద్భుతంగా గుర్తుచేశారని కొనియాడారు. కేసీఆర్ శైలిని ఎంతో బాధ్యతగా, పరిణతితో తెరపై పండించిన తీరు ప్రశంసనీయమని హరీష్ రావు పేర్కొన్నారు. శంకరన్న పాత్రతో ప్రియదర్శి తన నటనా పటిమను మరొకసారి చాటుకున్నారని, ఆయనకు భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

