ఇందిరమ్మ టవర్స్.. ఏడాదిలోపే ఇళ్ల తాళాలు: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలన్న సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. సీఎం రేవంత్  నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వమని అన్నారు. హైదరాబాద్ లోని నాంప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని రెడ్ హిల్స్ లో మంగ‌ళ‌వారం ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ (Indiramma Towers) నిర్మాణానికి మంత్రి అజారుద్దీన్‌, ఎంపీ అనిల్, ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో క‌లిసి పొంగులేటి శంకుస్ధాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సభలో పొంగులేటి మాట్లాడుతూ.. పేదవాడు తన జీవితకాలంలో ఒక్కసారైనా సొంత ఇంటిని చూసుకోవాలన్న ఆకాంక్షను నెరవేర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. క్యూఆర్/కోర్ ప్రాంతంలో ప్రభుత్వ భూములను గుర్తించి, వాటిని హౌసింగ్ శాఖకు బదలాయించి పేదల కోసం గ్రౌండ్ ప్లస్ టెన్ అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

పేదవాడికి ఇల్లు ఇచ్చేందుకే ప్రభుత్వం కృషి..

హైదరాబాద్ లో ఒక్కో ఏకరం రూ.200 నుంచి రూ.250 ఉన్నా.. పేదవాడికి సొంత ఇల్లు ఇచ్చేందుకే ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డ్రాలో 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. మిగిలిన వారికి రెండో, మూడో, నాలుగో విడతల్లోనూ ఇళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలోని మొత్తం 20 నియోజకవర్గాల్లో భూములను గుర్తించామని తెలిపారు. సుమారు 16 నుంచి 17 ప్రాంతాల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిందని.. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

ఏడాదిలోపే ఇంటి తాళాలు ఇస్తాం..

ప్రభుత్వం ప్రస్తుతం నిర్మిస్తున్న ఒక్కో అపార్ట్‌మెంట్ విలువ సుమారు రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందిరమ్మ టవర్స్ (Indiramma Towers) నిర్మాణం రెండు, మూడు సంవత్సరాల సమయం తీసుకోకుండా ఒక ఏడాదిలోపే పూర్తి చేస్తామని అన్నారు. ఇదే వేదిక నుంచి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

Also Read : కోహ్లీతో బంధంపై హిట్‌మ్యాన్ హాట్ కామెంట్స్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>