కలం, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. గుండ్రాతిమడుగు గ్రామంలో (Gundrathimadugu Tragedy) ఎల్ది నరేష్ (30) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ఫ్రెండ్స్ తో కలిసి బంధువుల ఇంటికి గణేష్ నిమజ్జనానికి వెళ్లిన నరేష్ ఇంటికి తిరిగిరాలేదు. మంగళవారం పంట పొలాల్లో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం అయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి స్వగ్రామం చిన్నగూడురు మండలం జయ్యారం అని తెలిపారు.యువకుడి అనుమానాస్పద మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

