రక్తంతో లేఖ.. దళితుల నిధులపై బీజేపీ నేత వినూత్న నిరసన

కలం, కరీంనగర్: దళితుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేపీ దళిత మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ (Somidi Venu) వినూత్న నిరసన చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు అందాల్సిన సబ్సిడీ రుణాలు, అభివృద్ధి నిధులను (SC Welfare Funds) వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తన స్వంత రక్తంతో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి పంపించారు. ఈ సందర్భంగా సోమిడి వేణుప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందాల్సిన సబ్సిడీ రుణాలు, అభివృద్ధి నిధులు నిలిచిపోవడంతో దళిత యువత, పేదలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళితులకు ఇచ్చిన పలు హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. దళితుల అభ్యున్నతికి కేటాయించాల్సిన నిధుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వెంటనే ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దళితులను ఐక్యం చేసి ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని సోమిడి వేణుప్రసాద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా అధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ, ఎడ్ల సురేష్, మెంగని రాజయ్య, గాలి సురేష్, కంపల్లి సుమన్, కుడిది నాగేందర్, సునీల్, నవీన్, పవన్ కళ్యాణ్, బండిపల్లి సంజీవ్, సతీష్, రాజు, శేషిధర్, సాయిరాం, భానుచందర్, సంగం వేణు, పెదపల్లి సాయి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>