మద్యం మత్తులో ఘాతుకం.. సొంత ఇంటికే నిప్పంటించిన యువకుడు!

కలం, సారంగాపూర్: సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామం (Swarna Village) లో మద్యం మత్తులో ఓ యువకుడు ఇంటికి నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది. తండ్రి, కుమారుడి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో ఆగ్రహానికి గురైన కుమారుడు ఊట్ల రఘు మంగళవారం ఉదయం ఇంటికి నిప్పుపెట్టాడు. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో ఇంట్లోని సామగ్రి దగ్ధమైంది.

గ్రామస్తులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

Also Read : ములుగు గట్టమ్మ ఆలయంలో “ది ప్యారడైజ్” చిత్ర బృందం ప్రత్యేక పూజలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>