కమీషన్లు ఇవ్వలేదనే బిల్లుల పెండింగ్: హరీశ్ రావు

కలం, వెబ్ డెస్క్: పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్న ప్రభుత్వం.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు మాత్రం నెలల తరబడి పెండింగులో పెట్టడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఫైర్ అయ్యారు. బడా కాంట్రాక్టర్ల మాదిరి కమీషన్లు ఇవ్వడం లేదని వారి బిల్లులు పెండింగులో పెట్టారా.. అని ప్రశ్నించారు. ఏకంగా రాష్ట్ర సచివాలయంలోనే చిన్న కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగడం సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలదించుకోవాల్సిన విషయమన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలంటే 20–30 శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారని గతంలో ఒకసారి ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

వారి సొమ్మును కూడా ఇవ్వరా..?

రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని గత మే నెలలో చెప్పినా.. ఇంతవరకు విడుదల చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు. వారి గోడు వినే సమయం కూడా లేదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 ఏళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. సర్వీసులో దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా వేధించడం అమానవీయమన్నారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగుల బకాయిలను ఇంతవరకు ఇవ్వకపోవడమేంటన్నారు. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకున్నారని.. అధికారంలోకి వచ్చాక ప్రజలకే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>