కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెబుతున్నదే నిజమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. సర్ విషయంలో తప్పులు జరుగుతున్న తీరుని ఇద్దరు ఎన్నికల కమిషనర్లే అంగీకరిస్తున్న తీరు దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతమన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా దేశ ప్రజల ఓట్లను తొలగించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదవిలో ఉండే అర్హత కోల్పోయారని.. వెంటనే తప్పుకోవాలని సూచించారు.
వారికి రాజ్యాంగంపై నమ్మకం లేదు..
ఎన్నికల సంఘం తీరుపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కోరారు. రాజ్యాంగంపై నమ్మకం లేని పార్టీలే సర్‌పై పోరాటానికి దూరంగా ఉంటారని విమర్శించారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. జ్ఞానేష్ కుమార్ బీజేపీకి తొత్తుగా మారిపోయారని.. ఆయన్ను ముందు పెట్టి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతోందన్నారు. వెంటనే సర్ ప్రక్రియను పూర్తి రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : ఆ ఎన్నికల్లో గెలవడమే మొదటి లక్ష్యం: కవిత
Follow Us On : WhatsApp

