కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) సర్కిల్ కార్యాలయంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. ఉదయం 11 గంటల సమయంలో కార్యాలయంలోని ఓ గదిలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పిఓపి) సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ శబ్దంతో సీలింగ్ ముక్కలు, ఇనుప ఫ్రేములు నేలపై పడటంతో గది శిథిలమైంది. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
శిథిలావస్థకు చేరిన భవనంలో సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర గదుల సీలింగ్‌లు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని, ఎప్పుడు ఊడిపడతాయో తెలియని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి భవనానికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని, లేదంటే సురక్షితమైన భవనానికి కార్యాలయాన్ని తరలించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Also Read : జూన్ 2028 నాటికి SLBC టన్నెల్ పూర్తి: మంత్రి ఉత్తమ్
Follow Us On : WhatsApp

