కలం, వెబ్ డెస్క్ : భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో స్వల్ప భూకంపం సంభవించింది. ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) ఉధంసింగ్ నగర్ సమీపంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైంది. సరిహద్దు పరిసర ప్రాంతాల్లో కొద్దిపాటి ప్రకంపనలు రావడంతో స్థానిక ప్రజలు కాసేపు భయాందోళనకు గురయ్యారు.
భూకంప తీవ్రత తక్కువగానే ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. హిమాలయ పర్వత శ్రేణులు భూకంప సున్నిత ప్రాంతాల పరిధిలోకి వస్తుండటంతో ఇక్కడ భూగర్భ పొరల్లో కలిగే చలనం వల్ల తరచూ ఇలాంటి ప్రకంపనలు వస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, స్థానిక అధికారులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read : ఆసియా గేమ్స్: కురాష్లో పింకీ బల్హారాకు కాంస్య పతకం
Follow Us On: X(Twitter)

