కల్లు దుకాణం తొలగించాలని ఎక్సైజ్ అధికారులకు వినతి

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ ( Sofi Nagar ) కాలనీలో రహదారి ఆనుకొని ఏర్పాటు చేసిన తెల్ల కల్లు దుకాణంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు సోమవారం ఎక్సైజ్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి పక్కనే కల్లు దుకాణం (Toddy Shop) ఉండటంతో మహిళలు, ఇతర కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఖాళీ సీసాలతో ప్రమాదాలు

దుకాణానికి వచ్చే కొందరు రహదారి పక్కనే మూత్ర విసర్జన చేయడంతో దుర్వాసనతో పాటు అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని వాపోయారు. అదేవిధంగా కల్లు తాగిన అనంతరం ఖాళీ సీసాలను రోడ్లపై పడేయడంతో అవి పగిలి గాజు పెంకులు రోడ్డుపై చెల్లాచెదురుగా ఉంటున్నాయని తెలిపారు. వాటి కారణంగా కాలనీవాసులు గాయపడిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రహదారి పక్కన ఉన్న కల్లు దుకాణాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>