‘రణబాలి’ ఫస్ట్ ట్రూత్‌.. ఆసక్తి పెంచుతున్న అప్‌డేట్‌

కలం, సినిమా: రౌడీ స్టార్ విజయ్‌ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన బిగ్గెస్ట్ పాన్‌ ఇండియా మూవీ  ‘రణబాలి’ (Ranabaali) నుంచి మేకర్స్‌ ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ తాజాగా సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “ఈ రోజు నుంచి మనకు తెలిసిన చరిత్ర ఇకపై మునుపటిలా కనిపించదు” అంటూ మేకర్స్‌ ప్రకటించారు.

‘Never Forget’ అనే ట్యాగ్‌తో ‘Truth 1: The Famine We Forgot’ పేరుతో తొలి నిజాన్ని ఈరోజు సాయంత్రం 4.05 గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ అప్‌డేట్‌ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘రణబాలి(Ranabaali)’ చిత్రం 2026 అక్టోబర్‌ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. సినిమా కథకు సంబంధించిన అంశాలను ‘Truth’ పేరుతో మేకర్స్‌ వెల్లడించనున్న నేపథ్యంలో రాబోయే అప్‌డేట్స్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read :  ఆసియా గేమ్స్: కురాష్‌లో పింకీ బల్హారాకు కాంస్య పతకం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>