బోరవెల్లి వద్ద బస్సు బోల్తా.. తృటిలో తప్పిన ప్రమాదం

కలం, ఆలంపూర్: జాతీయ రహదారి 44పై తమిళనాడు విద్యార్థులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి (Boravelli) స్టేజ్ సమీపంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న 37 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రం సేలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన 37 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని వండర్‌లాకు విహారయాత్రకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బోరవెల్లి శివారులో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా మరమ్మతులు జరుగుతున్న రహదారిపై బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను క్రమబద్ధీకరించారు. ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన విద్యార్థులను అలంపూర్ చౌరస్తాలోని 100 పడకల ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించారు. విద్యార్థులంతా క్షేమంగా ఉండటంతో వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>