కలం, వనపర్తి: ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ‘యువ టూరిజం క్లబ్’ పోటీల్లో వనపర్తి జాగృతి జూనియర్ కళాశాల విద్యార్థి (Wanaparthy Student) వడ్ల విజయ్ రాష్ట్రస్థాయి అవార్డు (Tourism Award) అందుకున్నారు.
షార్ట్ వీడియో కేటగిరీలో ప్రతిభ కనబరిచిన ఆయనకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. 2024–26 ఇంటర్మీడియట్ బ్యాచ్‌కు చెందిన విజయ్ సాధించిన ఈ ఘనతపై కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అధ్యాపకుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే తన విజయానికి కారణమని విజయ్ తెలిపారు.

