కారుకొండ గుహల్లో ఘనంగా పర్యాటక దినోత్సవం ​

కలం, ఖమ్మం బ్యూరో: బౌద్ధ వారసత్వ సంపద పరిమళాలు, స్వచ్ఛతా స్ఫూర్తి నడుమ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరం బౌద్ధ గుహల (Karukonda Buddhist Caves) వద్ద ఆదివారం ‘ప్రపంచ పర్యాటక దినోత్సవం–2026’ వేడుకలు ఘనంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా పర్యాటక నోడల్ అధికారి బి. అనూష ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్, డీఆర్డీవో ఎం. విద్యా చందన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చారిత్రక ప్రదేశాలను కాపాడుకుంటూ, పరిశుభ్రత పాటిస్తూ స్థానిక సమాజ భాగస్వామ్యంతో పర్యాటకరంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో భాగమైన బుద్ధిస్ట్ సొసైటీ ప్రతినిధులు కారుకొండ రామవరం బౌద్ధ గుహల చారిత్రక ప్రాధాన్యతను, వాటి పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. అలాగే ‘స్వచ్ఛతా హీ సేవా’లో భాగంగా విద్యార్థులు, యువతకు పర్యావరణహిత జీవనవిధానంపై అవగాహన కల్పించారు. పర్యాటకులకు నిరంతరం భద్రత అందిస్తున్న టూరిజం పోలీసుల సేవలను అభినందిస్తూ జిల్లా పర్యాటక నోడల్ అధికారి బి. అనూష వారిని ఘనంగా సత్కరించారు. ఈ వేడుకల్లో మండల పరిధిలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>