కలం, వరంగల్ బ్యూరో: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తాడ్వాయి మండలం వెంగలాపూర్ (Vengalapur)లో పాముకాటుతో ఆరు నెలల బాబు మృతి చెందాడు. ఈక తిరుపతి, స్వప్న దంపతులు తమ కుమారుడిని మంచంలో పడుకోబెట్టి.. ఇతర పనుల్లో నిమగ్నమయ్యారు. పాము కాటేసి తిరిగి వెళ్తుండగా తల్లి గుర్తించింది. ఆందోళన చెందిన దంపతులు ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గమధ్యలోనే మరణించాడు. ఆరు నెలల బాబు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

