రేపు నిర్మల్ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నిరసన

కలం, నిర్మల్: కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) తీసుకున్న నిర్ణయాలను నిరసిస్తూ సోమవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.

ఓట్ల చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bojju Patel) పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>