రణరంగంగా మారిన ధర్నా చౌక్.. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత!

కలం, వెబ్ డెస్క్ : నోషనల్ ఇంక్రిమెంట్లు, మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనాలు, ప్రమోషనల్ అవకాశాలు, జీఓ నెంబర్ 11 రద్దు తదితర డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ‘ఛలో విజయవాడ (Chalo Vijayawada)’ నిరసన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విజయవాడ గాంధీనగర్ సమీపంలోని ధర్నా చౌక్‌ వైపు ఆందోళనకారులు వెళ్తుండగా పోలీసులు వారిని మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు.

ఈ క్రమంలో పోలీసులు, సచివాలయ ఉద్యోగుల మధ్య భారీ తోపులాట జరగడంతో గాంధీనగర్, ధర్నా చౌక్ ప్రాంతాలు రణరంగంగా మారాయి. ఆందోళన తీవ్రతరం కాకుండా అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు ఉద్యోగులను ఈడ్చిపారేస్తూ రోడ్లపై నుంచి పక్కకు తరలించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఉద్యోగులలో పలువురిని పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన సచివాలయ ఉద్యోగులను గవర్నర్ పేట పోలీస్ స్టేషన్‌తో పాటు సమీప స్టేషన్లకు తరలించారు. పోలీసులు ఎంత ఒత్తిడి తెచ్చినా, తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

Also Read : పరిమితి దాటిన AI ఏజెంట్లు.. ఓపెన్ AI సంచలన నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>