విజేతలకు రాష్ట్రపతి ముర్ము అభినందనలు!

కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడలు (Asian Games) 2026లో అద్భుత ప్రదర్శనతో పతకాలు సాధించిన భారత క్రీడాకారులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మహిళల కబడ్డీ జట్టు, స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ జోడీ, షూటింగ్ బృందాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వారి విజయాన్ని ప్రశంసిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకున్న భారత షూటర్లు తిలోత్తమ సేన్, విదార్సా వినోద్, ఆషి చౌక్సీలను రాష్ట్రపతి ప్రశంసించారు.

జట్టు కృషి, పట్టుదలకు ఈ విజయం నిదర్శనమని ముర్ము (Droupadi Murmu) పేర్కొన్నారు. ఈ పోటీలో భారత త్రయం మొత్తం 1,763-90x స్కోరుతో రెండో స్థానంలో నిలవగా, చైనా స్వర్ణం, కజకిస్తాన్ కాంస్యం సాధించాయి. భారత్ తరఫున తిలోత్తమ 590-32x, విదార్సా 588-29x, ఆషి 585-29x పాయింట్లు సాధించారు. అలాగే స్క్వాష్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన జోష్నా చిన్నప్ప, వేలవన్ సెంథిల్‌కుమార్ జోడీని ద్రౌపదీ ముర్ము అభినందించారు.

వారి భాగస్వామ్యం, పట్టుదల భారత స్క్వాష్ క్రీడా స్ఫూర్తిని చాటిచెప్పాయని రాష్ట్రపతి ప్రశంసించారు. ఆరంభం నుంచి నిలకడగా రాణించిన ఈ జోడీ భారత్‌కు విలువైన పతకాన్ని అందించింది. మరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకున్న భారత మహిళల కబడ్డీ జట్టుపై ముర్ము ప్రశంసలు కురిపించారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో ఒత్తిడిని జయించి విజేతగా నిలవడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ కష్టపడి సాధించిన విజయం ఛాంపియన్ల ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ప్రతిబింబిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>