అంగన్వాడీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్

కలం, పెంబి : పెంబి మండలం నాగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని (New Anganwadi Centre) ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యాబోధన, ఇతర సౌకర్యాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకంగా పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ (MLA Bojju Patel) అన్నారు. చిన్నారులకు మెరుగైన వసతులు, నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. నూతన భవనాన్ని సద్వినియోగం చేసుకుని అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>