ఐలమ్మకు నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు

కలం, హనుమకొండ: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి (Chakali Ilamma Jayanti) సందర్భంగా న్యూ శాయంపేటలోని ఐలమ్మ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రజక సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, డాక్టర్ సత్యశారద తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ సామాజిక, చారిత్రక ఉద్యమాల్లో చాకలి ఐలమ్మ పోషించిన పాత్రను గుర్తుచేసుకున్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రజక సంఘాల నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>