కరీంనగర్‌ కాంగ్రెస్‌ కీలక సమావేశం.. మూడు తీర్మానాలు

కలం, కరీంనగర్ బ్యూరో: నాయకులు వ్యక్తులకు కాకుండా పార్టీకి కట్టుబడి పనిచేయాలని, ఈ నెల 30న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటనను విజయవంతం చేసి కాంగ్రెస్ పార్టీ (Karimnagar Congress) నగరంలో బలమైన శక్తిగా నిలిచేలా కృషి చేయాలని కాంగ్రెస్  నాయకులు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ఇందిరా భవన్ డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, నాయకుడు పురుమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీలో వర్గపోరుకు తావులేదని, ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ జెండా నీడలో ఐక్యంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో మూడు కీలక తీర్మానాలను ఆమోదించారు.

పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించేందుకు కరీంనగర్‌కు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి( Revanth Reddy) నగరంలోని 66 డివిజన్లలో జెండాలు, తోరణాలతో ఘన స్వాగతం పలకాలని నిర్ణయించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక, సాఫ్ట్‌వేర్ లోపాల కారణంగా సుమారు 50 శాతం మందికి నోటీసులు అందక ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఎస్‌ఐఆర్ గడువును అక్టోబర్ 31తో ముగించకుండా డిసెంబర్ వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఓటు చోరీకి నిరసనగా ఏఐసీసీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు సెప్టెంబర్ 28న కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>