వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులపై సమీక్ష

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్‌ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి (Warangal Hospital) నిర్మాణ పనుల పురోగతిని ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, సీఎంవో కార్యదర్శి కె.మాణిక్ రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఆసుపత్రి నిర్మాణం చూశారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై అక్కడే సమీక్ష చేశారు.

ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే.. ఉమ్మడి వరంగల్‌తో పాటు పరిసర జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ పరిశీలనలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>