డ్రైడేను పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ ఆదర్శ్‌ సురభి

కలం, వనపర్తి: డెంగ్యూ, సీజనల్‌ వ్యాధుల నివారణకు ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రైడే కార్యక్రమాన్ని నామమాత్రంగా కాకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని రాంనగర్‌ కాలనీలో డ్రైడే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. పరిసరాల్లో నీటి నిల్వలు, దోమల వృద్ధికి అనుకూల ప్రాంతాలను పరిశీలించి, తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పట్టణంలో ఇటీవల డెంగ్యూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి (Collector Adarsh Surabhi) సూచించారు. ఇళ్ల పరిసరాలు, ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రల్లో నీరు నిల్వ కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆరోగ్య, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో దోమల నివారణ చర్యలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

నాణ్యతతో ఇళ్ల నిర్మాణం

అనంతరం పట్టణంలోని నాలుగో వార్డులో కురుమమ్మ, ఎల్లమ్మ అనే లబ్ధిదారులు నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ప్రభుత్వ మార్గదర్శకాల అమలు, బిల్లుల చెల్లింపులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందేలా చూడాలని, నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయకుండా చూడాలని సూచించారు. అవసరమైన రుణాలను స్వయం సహాయక సంఘాల ద్వారా పొందేలా అధికారులు సహకరించాలని తెలిపారు. ఇళ్ల పునాదులను అవసరానికి మించి ఎత్తుగా నిర్మించకుండా, నిర్దేశిత ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్‌ నాయక్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ విఠోభా, కౌన్సిలర్లు పరశురాం, శరవంద, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : ‘చీటింగ్’ ఆరోపణలకు చెక్.. వైడ్‌పై ఆకాశ్ చోప్రా క్లారిటీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>