గణపతి నిమజ్జన వేడుకలు.. పొన్నం ఏరియల్ సర్వే

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో గణపతి నిమజ్జన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి.. సిటీలో నిమజ్జనం ఎలా జరుగుతుందో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం విజయవంతంగా పూర్తయిందని.. మరికాసేపట్లో బాలాపూర్ గణనాథుడిని కూడా నిమజ్జనం చేయబోతున్నట్లు తెలిపారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో విగ్రహాలను వీలైనంత త్వరగా తరలించి.. నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

ఎంజే మార్కెట్, చార్మినార్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడినా.. వెంటనే సంబంధిత శాఖల సమన్వయంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసే చర్యలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వివరించారు. రేపు ఉదయం లోగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భక్తులు సహకరిస్తే.. త్వరగా పూర్తియిపోతుందన్నారు. ఈ ఏరియల్ సర్వేలో డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand), సీపీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.

ట్యాంక్‌బండ్ వద్ద జనసందోహం..

హైదరాబాద్ నలువైపులా నుంచి నిమజ్జనానికి గణపతి విగ్రహాలను ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకొస్తుండటంతో అక్కడ జనసందోహం నెలకొంది. క్రేన్ల సాయంతో ఒక్కొక్క విగ్రహాన్ని జాగ్రత్తగా నిమజ్జనం చేస్తున్నారు. రాణిగంజ్ వైపు నుంచి వస్తున్న కొన్ని విగ్రహాలకు కాకతీయ కళాతోరణం అడ్డు పడటంతో కిరీటాలు తొలగించి.. తీసుకొస్తున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాల సిబ్బంది నిమజ్జన ప్రక్రియలో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. అదే సమయంలో ట్యాంక్ బండ్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది.

Also Read: ఉద్యోగుల డిమాండ్లకు సర్కార్ సానుకూల హామీలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>