కలం, ఆదిలాబాద్: ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అన్నారు. సిరికొండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి సీడం అర్జున్ ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర కళాశాలలో బీఎస్సీ (ఆనర్స్) ఫిజిక్స్‌లో సీటు సాధించాడు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో అర్జున్‌కు రూ.50 వేల ఆర్థిక సహాయం(Financial Help) చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Rajarshi Shah) మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థి జాతీయ స్థాయి విద్యాసంస్థలో సీటు సాధించడం అభినందనీయమన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్‌కు విద్యార్థి సీడం అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : ప్రోటోకాల్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు!: ఎంపీ రఘునందన్ ఫైర్
Follow Us On : WhatsApp

