కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ (Khairatabad) జంక్షన్ సమీపంలో శుక్రవారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర సమయంలో విషాదం చోటుచేసుకుంది. గణనాథుడి నిమజ్జనం కోసం వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు వాహనం కింద పడి మృతి చెందాడు.
ఖైరతాబాద్ మెట్రో పిల్లర్ నంబర్ 1167 సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించినప్పటికీ, సదరు వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు.

