హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం.. ఆర్టీసీ, మెట్రో ప్రత్యేక ఏర్పాట్లు

కలం, వెబ్ డెస్క్: రాజధాని నగరం హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్భంగా రాష్ట్ర ఆర్టీసీ (Hyderabad TSRTC) భారీ ఏర్పాట్లు చేసింది. 24 గంటల పాటు నగరంలోని వివిధ ప్రాంతాలనుంచి 700 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు సంస్థ తెలిపింది.  హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల నుంచి నగరంలోని వివిధ రూట్లకు నిరంతరాయంగా ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ​ట్రాఫిక్ డైవర్షన్ల కోసం పోలీస్ కంట్రోల్ రూమ్‌లు, 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను నియమించింది.

జోనల్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్..

నగరంలో ఎప్పటికప్పుడు​ ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించేందుకు జోనల్ ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ​అత్యవసర సహాయం కోసం ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వి.వి. విగ్రహం వద్ద ఆర్టీసీ రిలీఫ్ వాహనాలు ఏర్పాటు చేసింది. అలాగే ​ ఖైరతాబాద్, లక్డీకాపూల్, కోటి, బషీర్‌బాగ్, ఇందిరా పార్క్, ఏఐఆర్  వద్ద ఆర్టీసీ ప్రత్యేక క్యాంపులు సిద్ధం చేసింది. ​

అవాంతరాలు లేకుండా: బస్సులకు అత్యవసర మరమ్మతులు చేయడానికి పోలీసు స్టేషన్ల వద్ద 113 మంది డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. ​ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు సిటీ, అంతర్రాష్ట్ర బస్సుల (APSRTC, KSRTC) రూట్లను మళ్లించింది.​శనివారం ఉదయం వరకు నిమజ్జనం కొనసాగినా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించింది.

అర్ధరాత్రి వరకు మెట్రో..

అటు నగరంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో మెట్రో సేవలను అర్ధరాత్రి ఒంటి గంట వరకు అందించనున్నట్లు మెట్రో స్పష్టం చేసింది. అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు ఒంటి గంటకు బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తులు, రాత్రి సమయంలో ప్రయాణించేందుకు వీలుగా ఈ సేవలను పొడిగించినట్లుగా తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>