కలం, ముంబై : ముంబై వర్లిలోని పద్మశాలి సమాజ సుధారక మండలి సంఘం భవనంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సచిన్ అహిర్ (Sachin Ahir) గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం సంఘ సభ్యులు సచిన్ అహిర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం మాజీ చైర్మన్ వాసాల శ్రీహరి, అధ్యక్షుడు కస్తూరి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి వీరబత్తిని సత్యనారాయణతో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

