కలం, వెబ్ డెస్క్ : 22ఏ సెక్షన్ (Section 22A) పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జీహెచ్ఎంసీ, డీటీసీపీ, హెచ్ఎండీఏ అనుమతులుంటే 22ఏ పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
తెలంగాణలో 22ఏ సెక్షన్ రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. సాధారణంగా రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద ప్రభుత్వం నిషేధిత లేదా రిజిస్ట్రేషన్‌కు పరిమితులు ఉన్న భూములను జాబితాలో చేర్చుతుంది. 22ఏ పై ప్రభుత్వం నిర్ణయం భూములపై రిజిస్ట్రేషన్లను నిలిపివేయడం వల్ల అనేక మంది భూ యజమానులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంబంధిత ప్రణాళికా సంస్థల అనుమతులు ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ మార్గం సుగమం కానుంది. దీంతో 22ఏ పరిధిలోని భూముల విషయంలో ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ప్రభుత్వ నిర్ణయంతో ఊరట లభించనుంది.

