రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు సెయింట్‌ థామస్‌ విద్యార్థులు ఎంపిక

కలం, వనపర్తి : వనపర్తి (Wanaparthy) పట్టణంలోని సెయింట్‌ థామస్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల వనపర్తిలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీల్లో పాఠశాలకు చెందిన అరుణ్‌, రోహిత్‌ ప్రతిభ కనబరిచారు. అండర్‌–16 జావెలిన్‌ త్రో విభాగంలో అరుణ్‌, లాంగ్‌జంప్‌లో రోహిత్‌ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలోని జేఎన్‌ స్టేడియంలో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌–2026లో వారు పాల్గొననున్నారు. విద్యార్థుల ఎంపికపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫాదర్‌ ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>