కలం, ఉట్నూర్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ (Utnoor) మండల కేంద్రంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్రను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) బుధవారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించిన భక్తులు నిమజ్జన శోభాయాత్రను కూడా అదే భక్తిభావంతో ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. పోలీసులకు, ఉత్సవ నిర్వాహకులకు సహకరిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

