నిమజ్జనంలో విషాదం.. బైక్ ఢీకొని ఎస్సై మృతి

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జన బందోబస్తు విధుల్లో ఉన్న ఒక పోలీస్‌ అధికారి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగూడెం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కిన్నెర వెంకన్న (SI Venkanna), నిమజ్జన డ్యూటీలో భాగంగా ఎన్‌టీఆర్‌ మార్గ్‌లోని క్రేన్‌ నంబర్‌-2 వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు.

ఆ సమయంలో రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని బైక్‌ ఆయనను ఢీకొట్టి, ఆగకుండా అక్కడి నుంచి పరారైంది. ప్రమాదం జరిగిన వెంటనే వెంకన్న (SI Venkanna) స్వల్ప గాయాలయ్యాయని భావించి, విశ్రాంతి కోసం తన స్వగ్రామానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వరంగల్‌ చేరుకునేసరికి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో, కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరారీలో ఉన్న బైకర్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read : బోరు ఎండింది.. నల్లా నీరే దిక్కైంది..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>