నిర్మల్‌లో నిమజ్జనం ఏర్పాట్లపై డీఐజీ సమీక్ష

కలం, నిర్మల్: ఈ నెల 25న నిర్మల్ జిల్లా కేంద్రంలో జరగనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని బాసర జోన్ డీఐజీ ఆర్.భాస్కరన్ (DIG Bhaskaran) సూచించారు. బుధవారం నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. నిమజ్జన శోభాయాత్ర మార్గాలు, బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రజల భద్రత తదితర అంశాలపై సమీక్షించారు. అనంతరం బాసర పట్టణంలో నిమజ్జనం జరిగే ప్రాంతాలను డీఐజీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా పని చేయాలని ఆదేశించారు. డీఐజీ వెంట భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, బాసర సీఐ దీపక్, ఎస్సై శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>