నల్లచెరువు ట్యాంక్ బండ్‌లో నిమజ్జన ఏర్పాట్లు.. కలెక్టర్ కీలక ఆదేశాలు!

కలం, వనపర్తి: వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వనపర్తి జిల్లా కలెక్టర్‌ (Wanaparthy Collector) ఆదర్శ్‌ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లచెరువు ట్యాంక్‌బండ్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మంగళ, బుధ, గురువారాల్లో పెద్ద సంఖ్యలో విగ్రహాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ నియంత్రణ, బారికేడింగ్‌, పార్కింగ్‌, విద్యుత్‌ దీపాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ప్రజలు నీటిలోకి వెళ్లకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, విగ్రహాల నిమజ్జనానికి భారీ క్రేన్లను వినియోగించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సిబ్బంది, పరికరాలను అందుబాటులో ఉంచాలని, పోలీసు, మున్సిపల్‌, రెవెన్యూ, వైద్య, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిమజ్జనం అనంతరం ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>