భైంసాలో గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

కలం, భైంసా: భైంసా (Bhainsa) పట్టణంలో మంగళవారం జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్రను (Ganesh Immersion) ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టిందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) తెలిపారు. సోమవారం పట్టణంలో పోలీస్ సిబ్బందితో కలిసి రూట్ మార్చ్ నిర్వహించిన ఆమె.. శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలు, కూడళ్లు, సున్నిత ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. గణేష్ నిమజ్జన బందోబస్తు కోసం అడిషనల్ ఎస్పీతో పాటు 14 మంది డీఎస్పీలు, 50 మంది సీఐలు, 700 మంది పోలీస్ సిబ్బందిని నియమించినట్లు ఎస్పీ తెలిపారు.

నిమజ్జన శోభాయాత్రలో డీజే సౌండ్‌ను నిర్దేశిత పరిమితులకు లోబడి వినియోగించాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. గణేష్ మండపాల నిర్వాహకులు, యువత, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. అనంతరం గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగే గడ్డెన్న వాగును ఎస్పీ పరిశీలించారు. కార్యక్రమంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>