కరీంనగర్‌లో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

కలం, కరీంనగర్: కొండా లక్మణ్ బాపుజీ చూపిన ఆశయాలు, త్యాగనిరతి నేటి తరానికి ఎంతో స్పూర్తి దాయకమని  (Karimnagar Mayor) కొలగాని శ్రీనివాస్ (Kolagani Srinivas) అన్నారు. కరీంనగర్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలితరం ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

సోమవారం నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద జరిగిన వర్థంతి వేడుకలకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండ లక్ష్మణ్ బాపుజీ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకన్నారు.

బాపూజీ త్యాగాలు చిరస్మరణీమం: కొలగాని శ్రీనివాస్

​ఈ సందర్భంగా కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో బాపూజీ పాత్ర చిరస్మరణీయమని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 ఉద్యమంలో తన మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన నిబద్ధత కలిగిన గొప్ప నాయకుడన్నారు.

బహుజనుల, చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు అనితరసాధ్యమని కొనియాడారు. బాపూజీ చూపిన ఆశయాలు, త్యాగనిరతి నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వాసాల రమేష్, దేవసాని సరస్వతి సత్యనారాయణ, తేల్ల లక్ష్మి రమేష్, మాసం గణేష్, పాడిశెట్టి వసంత లక్ష్మీ, భూమయ్య, చొప్పరి జయశ్రీ వేణు, వేముల కవిత చంద్రశేఖర్, పద్మశాలి సంఘం నాయకులు మెతుకు సత్యం తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>