కలం, జగిత్యాల: తెలంగాణ లీగల్ స్టూడెంట్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నిక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. నూతన అధ్యక్షుడిగా వేముల దేవేందర్ రెడ్డి (Vemula Devender Reddy), ప్రధాన కార్యదర్శిగా ముత్యాల రమేష్, ఉపాధ్యక్షుడిగా ఆశల రాజశేఖర్ ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా రాగిళ్ల వేణుగోపాల్, మీడియా సెక్రెటరీగా అబ్బ రాజేష్, జిల్లా లీగల్ అడ్వైజర్‌గా పంతం సందీప్ కుమార్, ట్రెజరర్ కోణారపు ఆర్తి, జిల్లా స్పోర్ట్స్ కార్యదర్శిగా తిరుమణి రాజశేఖర్ ఎన్నికయ్యారు.
రాష్ట్ర అధ్యక్షులు కె.బాలు నాయక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి ఎన్.రాకేష్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక ప్రక్రియ జరిగింది. సంస్థ అభివృద్ధి, న్యాయ విద్యార్థుల సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయంపై అవగాహన కల్పించే లక్ష్యంలో భాగంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంస్థపై ఉన్న నమ్మకం, విద్యార్థుల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న వేముల దేవేందర్ రెడ్డిని జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

