కలం, వెబ్ డెస్క్: ఏపీలో 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ (IPS Transfers) చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం జిల్లా ఎస్పీగా కె.చక్రవర్తి, పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీశ్ అదహళ్లి, మార్కాపురం జిల్లా ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా నియమితులయ్యారు. రాష్ట్ర ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ వర్మ, సీఐడీ సైబర్ క్రైమ్స్ ఐజీగా జయలక్ష్మి, రైల్వే విభాగ ఐజీగా, మహిళా భద్రతా విభాగం ఐజీగా బి.రాజకుమారి, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అట్టాడ బాబూజీకి పోస్టింగ్ ఇచ్చారు. ఇక ఇటీవలే సస్పెన్షన్ వేటు తొలగిపోయి తిరిగి విధుల్లో చేరిన విశాల్ గున్నికి ట్రైనింగ్ విభాగ డీఐజీగా, కాంతిరాణా టాటాకు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ భద్రతా విభాగం ఐజీగా నియమించారు.

