ఫలించిన పోరాటం.. పాలిటెక్నిక్ విద్యపై యూ టర్న్

కలం, వెబ్ డెస్క్: పాలిటెక్నికల్ విద్యార్థుల పోరాటం ఫలించింది. పాలిటెక్నిక్ విద్య (Polytechnic Education)ను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. పాత పద్ధతిలోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని నిర్ణయించింది. సాంతికే విద్యా శాఖ, సాంకేతిక విద్యా మండలి ఇప్పుడున్న విధంగా ఉంటాయని స్పష్టం చేసింది.

పాలిటెక్నిక్ విద్య సైతం సాంకేతిక విద్యా శాఖ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది. మూడేళ్ల డిప్లొమా కోర్సుల నిర్వహణలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండబోవని.. విద్యార్థులు లేటరల్ ఎంట్‌రీ ద్వారా బీ.టెక్ కోర్సుల్లో చేరవచ్చని వివరించింది. అంతేగాకుండా.. ఏఐసీటీఈ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని.. స్కిల్ యూనివర్సిటీ ప్రమేయం ఉండబోదని తేల్చి చెప్పింది. దీంతో గత 35 రోజులుగా విద్యార్థులు, అధ్యాపకులు సాగిస్తున్న పోరాటం విజయవంతమైంది.

జీవో నెం.97తో రగడ..

పాలిటెక్నిక్ విద్యను నైపుణ్యాభివృద్ధిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.97 జారీ చేసింది. దీని ప్రకారం, ఇక నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు సాంకేతిక విద్యా శాఖ నుంచి కమిషనరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (సీఈటీ) పరిధిలోకి తీసుకొస్తారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలను పర్యవేక్షిస్తుంటుంది. దీనిపై విద్యార్థులు అభ్యంతరాలు లేవెత్తారు. కొత్త విధానం వలన తాము బీ.టెక్ లేటరల్ ఎంట్రీ పొందలేమని.. భవిష్యత్తులో సాంకేతిక విద్య నుంచి దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దీనిపై ఉద్యమాలు జరిగాయి. తాజాగా, ఈ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>