నిమజ్జనం ఇలా చేస్తే పుణ్యం..! అర్చకుడి సూచనలు వైరల్

కలం, వెబ్ డెస్క్ : హిందూ ధర్మంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రకృతిని పూజించడం సంప్రదాయంలో భాగమని ఓ అర్చకుడు తెలిపారు. అయితే పూజా కార్యక్రమాల అనంతరం వ్యర్థాలను నదులు, చెరువుల్లో వేయడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించకూడదని సూచించారు. నిమజ్జనం (Ganesh Immersion) సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, కాలుష్యాన్ని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ ఆయన చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూజా కార్యక్రమాల అనంతరం మిగిలిన వస్తువులను రెండు భాగాలుగా వేరు చేసుకోవాలని అర్చకుడు సూచించారు. చెత్తలో వేయాల్సిన వాటిని డస్ట్‌బిన్‌లో వేయాలని, ముఖ్యంగా మిగిలిపోయిన కుంకుమ, పసుపు తదితరాలను ప్లాస్టిక్ కవర్లతో సహా చెరువులు, నదుల్లో వేయకూడదని చెప్పారు. వాటిని చెత్తలో వేయడం వల్ల ఎలాంటి అపరాధం కలగదని స్పష్టం చేశారు.

అదే సమయంలో పూలు, పండ్లు వంటి సహజసిద్ధమైన పదార్థాలను నీటిలో వేయవచ్చని తెలిపారు. అయితే ప్లాస్టిక్, ఇతర కృత్రిమ వ్యర్థాలను నీటిలో వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. భక్తి పేరుతో నదులు, చెరువులను కలుషితం చేయకూడదని, ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అర్చకుడు పేర్కొన్నారు. ప్రకృతిని పరిరక్షిస్తే అదే మనకు మేలు చేస్తుందని ఆయన సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>