అధికారులంతా ఆ భేటీలోనే.. రేపు ‘ప్రజావాణి’కి బ్రేక్..!

​కలం, ఖమ్మం బ్యూరో : జిల్లా వ్యాప్తంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో నిర్వహించే ‘ప్రజావాణి’ (Prajavani) కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రేపు (సోమవారం) ప్రజావాణి నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

​తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ తో పాటు ఐదుగురు సభ్యుల ఉన్నత స్థాయి బృందం ఈ నెల 21న (సోమవారం) జిల్లాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, భూ సమస్యలు, ఆర్‌ఓఆర్ అమలు తీరు తదితర కీలక అంశాలపై జిల్లా అధికార యంత్రాంగంతో కమిషన్ ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించనుంది.

​ఈ ఉన్నత స్థాయి సమీక్ష భేటీకి జిల్లా స్థాయి అధికారులతో పాటు అన్ని సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంది. అధికారులంతా ఆ భేటీలోనే నిమగ్నమై ఉంటారు. ఈ కారణంతోనే సోమవారం నాటి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ​ఈ విషయాన్ని గమనించి దూర ప్రాంతాల నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులు సమర్పించేందుకు అర్జీదారులు, ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని కలెక్టర్ అంకిత్ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>