మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విస్తృత పర్యటన

కలం, జడ్చర్ల: మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి (Lakshma Reddy) ఆదివారం జడ్చర్లలో విస్తృతంగా పర్యటించారు. వివిధ శుభకార్యాల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ప్రేమ్ రంగ గార్డెన్‌లో తంగళ్లపల్లి గ్రామ మాజీ సర్పంచి దివంగత జంగయ్య కుమారుడు రాము కుటుంబంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. చిన్నారిని ఆశీర్వదించారు. అంబేద్కర్ కళాభవన్‌లో చర్లపల్లికి చెందిన శ్రీకాంత్ గౌడ్ కుమారుడి తొలి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ పర్యటనలో మాజీ జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ డాక్టర్ కోడ్గల్ యాదయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, మాజీ మార్కెట్ ఛైర్మన్ పిట్టల మురళి, సర్పంచుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు ప్రణీల్ చందర్, మాజీ కౌన్సిలర్ దేవా, బీఆర్ఎస్ కార్మిక విభాగం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, ముడా మాజీ డైరెక్టర్లు ఇంతియాజ్ ఖాన్, ఎంబి శ్రీకాంత్ నాయకులు కొండల్, బాలు, పార్వతమ్మ, శంకర్ నాయక్, కరాటే శ్రీను పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>